మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Marakatha Sri Lakshmi Ganapathi Stotram – మరకత శ్రీ లక్ష్మీగణపతి స్తోత్రం

వరసిద్ధిసుబుద్ధిమనోనిలయం
నిరతప్రతిభాఫలదాన ఘనం
పరమేశ్వర మాన సమోదకరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 1 ||

అణిమాం మహిమాం గరిమాం లఘిమాం
ఘనతాప్తి సుకామవరేశవశాన్
నిరతప్రదమక్షయమంగళదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 2 ||

జననీజనకాత్మవినోదకరం
జనతాహృదయాంతరతాపహరం
జగదభ్యుదయాకరమీప్సితదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ ||3 ||

వరబాల్యసుఖేలనభాగ్యకరం
స్థిరయౌవనసౌఖ్యవిలాసకరం
ఘనవృద్ధమనోహరశాంతికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 4 ||

నిగమాగమలౌకికశాస్త్రనిధి
ప్రదదానచణం గుణగణ్యమణిమ్
శతతీర్థవిరాజితమూర్తిధరమ్
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 5 ||

అనురాగమయం నవరాగయుతం
గుణరాజితనామవిశేషహితం
శుభలాభవరప్రదమక్షయదం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 6 ||

పృథివీశ సుపూజితపాదయుగం
రథయాన విశేషయశోవిభవం
సకలాగమ పూజితదివ్యగుణం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 7 ||

గగనోద్భవగాంగసరిత్ప్రభవ
ప్రచురాంబుజపూజితశీర్షతలం
మణిరాజితహైమకిరీటయుతం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 8 ||

ద్విజరాజదివాకరనేత్రయుతం
కమనీయశుభావహకాంతిహితం
రమణీయ విలాసకథావిదితం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 9 ||

హృదయాంతరదీపకశక్తిధరం
మధురోదయదీప్తికళారుచిరం
సువిశాలనభోంగణదీప్తికరం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 10 ||

కవిరాజవిరాజితకావ్యమయం
రవికాంతి విభాసితలోకమయం
భువనైక విలాసితకీర్తిమయం
ప్రణమామి నిరంతరవిఘ్నహరమ్ || 11 ||

శ్రీ మరకత లక్ష్మీగణేశ స్తోత్రం సంపూర్ణమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.